Homeగాసిప్స్బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రీమేక్ హ‌క్కులు అల్లు అర‌వింద్‌కు?

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రీమేక్ హ‌క్కులు అల్లు అర‌వింద్‌కు?

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రీమేక్ హ‌క్కులు అల్లు అర‌వింద్‌కు?
బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రీమేక్ హ‌క్కులు అల్లు అర‌వింద్‌కు?

ప్ర‌స్తుతం రీమేక్‌ల సీజ‌న్ న‌డుస్తోంది. మ‌ల‌యాళ హిట్ చిత్రాల్ని మ‌న వాళ్లు తెలుగులో రీమేక్ చేయ‌డానికి పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్‌లుగా నిలిచిన చిత్రాల్ని హిందీలో మ‌న వాళ్లే రీమేక్ చేస్తున్నారు కూడా. ఇదిలా వుంటే తెర‌పైకి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ వ‌చ్చేసింది. దాదాపు 11 ఏళ్ల క్రితం అనుష్క‌కు స్టార్ డ‌మ్‌ని తెచ్చిపెట్టిన చిత్రం `అరుంధ‌తి`. ఎం. శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి నిర్మాణంలో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

హీరోయిన్‌గా కీల‌క పాత్ర‌లో న‌టించిన అనుష్క ఈ సినిమాతో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ఈ చిత్రం విడుద‌లై దాదాపు 11 ఏళ్ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ చిత్ర హిందీ రీమేక్ హ‌క్కుల్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సొంతం చేసుకున్న‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే తెలుగు నుంచి `అర్జున్‌రెడ్డి` రీమేక్ అయి బాలీవుడ్‌లో రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇదే బాట‌లో `జెర్సీ`, హిట్‌, ఇస్మార్ట్ శంక‌ర్‌, ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ రీమేక్ అవుతున్నాయి.

- Advertisement -

ఇందులో ఇప్ప‌టికే `జెర్సీ` రీమేక్ మొద‌లైంది. `అరంథ‌తి` రీమేక్‌లో దీపికా ప‌దుకునే న‌టించే అవ‌కాశం వుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు  సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అల్లు అర‌వింద్ వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది. దీపికా ప‌దుకునే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా తెర‌పైకి రానున్న భారీ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All