Homeటాప్ స్టోరీస్మహానటి చిత్రంపై వివాదాలు

మహానటి చిత్రంపై వివాదాలు

allegations on mahanati biopicమహానటి సావిత్రి బయోపిక్ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు అయితే ఎంతగా ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందో ఆ స్థాయిలో కాకపోయినా ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి ఇక కొంతమంది సావిత్రి వీరాభిమానులు మాత్రం ఈ బయోపిక్ లో ఆమె గొప్పదనాన్ని ఇంకా చెప్పాల్సిందని , అలాగే జెమిని గణేశన్ వల్లే ఆమె దీన స్థితి కి చేరుకుందని అలాగే దగ్గరి బంధువులు ఆమెని మోసం చేసారాని వాటిని పెద్దగా ప్రస్తావించలేదని ఇలా ఒకటి రెండు కాదు చాలా విషయాలను ఉదాహరిస్తున్నారు .

అంతేనా మహానటుడు ఎన్టీఆర్ పాత్ర ని కేవలం ఒక్క సన్నివేశానికే పరిమితం చేసారని , ఆమె మహానటి గా ఎదగడంలో ఎన్టీఆర్ పాత్ర అమోఘమని ఆ ఇద్దరి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు . అయితే ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ …….. నాగ్ అశ్విన్ మాత్రం మహానటి చిత్రాన్ని జనరంజకంగా రూపొందించాడు అనడంలో సందేహం లేదు . తనకున్న పరిధిమేరకు మంచి ప్రయత్నమే చేసాడు . చిన్న చిత్రంగా విడుదలైన మహానటి కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . సినిమా అంటే చూడకుండా ఇంటి పట్టునే ఉండే ముసలి వాళ్ళు సైతం మహానటి ని చూడటానికి థియేటర్ లకు సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All