Homeగాసిప్స్డిస్కో రాజా సినిమాలో అల్లరోడు ఉన్నాడా?

డిస్కో రాజా సినిమాలో అల్లరోడు ఉన్నాడా?

డిస్కో రాజా సినిమాలో అల్లరోడు ఉన్నాడా?
డిస్కో రాజా సినిమాలో అల్లరోడు ఉన్నాడా?

కామెడీ హీరోగా అల్లరి నరేష్ తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు. కొన్నేళ్ల క్రితం వరస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కెరీర్ తర్వాత్తర్వాత పూర్తిగా డీలా పడింది. టివి ఛానల్స్ లో జబర్దస్త్ వంటి షోస్ తోనే కామెడీ వస్తుండడం ఒక కారణమైతే సినిమాల ఎంపికలో అల్లరి నరేష్ చేసిన తప్పులు మరొక కారణం. ఇలా పలు కారణాలతో అల్లరి నరేష్ కామెడీ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. రీసెంట్ గా ఈ కామెడీ హీరో నుండి వచ్చిన సోలో హిట్ అంటే కష్టమే. అందుకే ఈ అల్లరోడు రూట్ మార్చాడు. పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి సిద్ధమయ్యాడు. నిజానికి ఇది నరేష్ ఎప్పటినుండో చేస్తున్నదే. హీరోగా కొనసాగుతున్నప్పుడు కూడా మల్టీస్టారర్ సినిమాలకు, వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు ఎప్పుడూ ముందున్నాడు. గమ్యం, శంభో శివ శంభో అలా వచ్చిన చిత్రాలే.

ఈ ఏడాది అల్లరి నరేష్, మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. మహేష్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ ఎమోషనల్ రోల్ లో అందరినీ మెప్పించాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు తన పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని డిసైడ్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న మాట.. మాస్ మహారాజా డిస్కో రాజా సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర చేస్తున్నాడని.

- Advertisement -

ఈ వార్తతో అతి రవితేజ ఫ్యాన్స్, ఇటు అల్లరి నరేష్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. అయితే దర్శకుడు విఐ ఆనంద్ వీరి ఆశలపై నీళ్లు చల్లాడు. నిన్న ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టగా అల్లరి నరేష్ మీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అంట కదా అని ఒక వ్యక్తి అడగ్గా, ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని చెప్పాడు దర్శకుడు. డిస్కో రాజా చిత్రం జనవరి 24న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All