Homeటాప్ స్టోరీస్అలియాభ‌ట్ జ‌క్క‌న్న‌కు త‌ల‌నొప్పిగా మారిందా?

అలియాభ‌ట్ జ‌క్క‌న్న‌కు త‌ల‌నొప్పిగా మారిందా?

అలియాభ‌ట్ జ‌క్క‌న్న‌కు త‌ల‌నొప్పిగా మారిందా?
అలియాభ‌ట్ జ‌క్క‌న్న‌కు త‌ల‌నొప్పిగా మారిందా?

రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` అలియా కార‌ణంగా మ‌రింత ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ఇందులో అలియాభ‌ట్‌ని రాజ‌మౌళి ఎంపిక చేసుకున్నారు. అయితే ఆమె కార‌ణంగా సినిమాకు క్రేజ్ ఏర్ప‌డుతుంద‌ని భావిస్తే ఆమె వ‌ల్లే సినిమా మ‌రింత ఆల‌స్యం అవుతోంద‌ట‌.

ఈ నెల మొద‌టి వారం నుంచి అలియాభ‌ట్ `ఆర్ ఆర్ ఆర్‌` సెట్లో కి ఎంట‌ర‌వుతుంద‌ని, ఆమెతో పాటు రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాలు.. ఆ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల క‌ల‌యిక‌లో మ‌రిన్ని స‌న్నివేశాల్ని చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఆ ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. కార‌ణం అలియాభ‌ట్ మ‌రో రెండు వారాల త‌రువాతే `ఆర్ ఆర్ ఆర్‌` సెట్‌లోకి ప్ర‌వేశించ‌నుంద‌ట‌.

- Advertisement -

సంజ‌య్ లీలా భ‌న్సాలీ చిత్రం `గంగూబాయి కతియావాడి`లో న‌టిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ కూడా ఆల‌స్యం అవుతోంది. ఈ మూవీ కోసం మ‌రిన్ని డేట్స్‌ని అలియా అడ్జెస్ట్ చేసింద‌ట‌. అలా చేయ‌డం వ‌ల్ల `ఆర్ ఆర్ ఆర్‌` షెడ్యూల్ మార్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. రెండు వారాల త‌రువాతే అలియా `ఆర్ ఆర్ ఆర్‌`కు డేట్స్ కేటాయించ‌నుంద‌ట‌. ఇదీ కాకుండా రెండు రోజుల క్రితం చిరంజీవికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో రామ్‌చ‌ర‌ణ్ కూడా షూట్‌కి దూర‌మ‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. తాజా ప‌రిస్థితులు రాజ‌మౌళికి మ‌రింత చికాకు తెప్పిస్తున్నాయ‌ని చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All