
సౌత్ నుండి ప్యాన్ ఇండియా చిత్రాలు రావడం బాగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు, తమిళ్ చిత్రాలు ప్యాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాయి. ప్యాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు నార్త్ మార్కెట్ ను ఆకర్షించడానికి బాలీవుడ్ భామలను తమ సినిమాల్లోకి తీసుకోవడం కలిసొస్తుందని నమ్ముతున్నారు ఇక్కడి మేకర్స్. అందుకే వాళ్లకు ప్యాన్ ఇండియా చిత్రాల్లో డిమాండ్ పెరుగుతోంది.
ఇప్పటికే రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రానికి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మించనున్న మరో చిత్రం విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందేది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కూడా కియారానే అనుకుంటున్నారట. ఈ రెండు చిత్రాల కోసం దిల్ రాజు, కియారాకు భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసాడట.
అలాగే ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో కూడా ఒక ప్యాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. త్వరలోనే షూటింగ్ కు కూడా వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ను సంప్రదిస్తున్నారట. మరి ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.