Homeటాప్ స్టోరీస్గంగూభాయ్ ను పూర్తి చేసిన అలియా భట్

గంగూభాయ్ ను పూర్తి చేసిన అలియా భట్

గంగూభాయ్ ను పూర్తి చేసిన అలియా భట్
గంగూభాయ్ ను పూర్తి చేసిన అలియా భట్

బాలీవుడ్ టాప్ నటి అలియా భట్  ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోంది అలియా. ఇంకా తన పోర్షన్ ను పూర్తి చేయడానికి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే దీని కోసం ఆమెకు బాలీవుడ్ కమిట్మెంట్స్ ఉన్నాయి.

కానీ అలియా భట్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మక చిత్రం గంగూభాయ్ షూటింగ్ ను పూర్తి చేసింది.  విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గంగూభాయ్ టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

గంగూభాయ్ షూటింగ్ పూర్తైన విషయాన్ని అలియా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 2019 డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాం. రెండేళ్లు పట్టింది పూర్తవ్వడానికి. ఈ రెండేళ్లలో రెండు లాక్ డౌన్స్ ను చూసింది ఈ చిత్రం అని పోస్ట్ చేసింది అలియా భట్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All