Homeటాప్ స్టోరీస్సితార‌కు అలియాభ‌ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటీ?

సితార‌కు అలియాభ‌ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటీ?

సితార‌కు అలియాభ‌ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటీ?
సితార‌కు అలియాభ‌ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటీ?

బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ కోసం గ‌త కొన్ని నెల‌లుగా జ‌క్క‌న్న వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఆదివారం `ఆర్‌ఆర్‌ఆర్` షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ లో ల్యాండైన  అలియా భట్ కు రాజ‌మౌళి సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` షూట్ జ‌రుగుతోంది. ఇదిలా వుంటే మహేష్ బాబు, నమ్రతాల ముద్దుల కూతురు కోసం ప్రత్యేక బహుమతిని తీసుకురావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

అలియాకు  `ఈద్ ఏ మమ్మా` అనే ఓన్ క్లాతింగ్ బ్రాండ్ వుంది.  త‌న క్లాత్ బ్రాండ్ నుండి ఒక అందమైన డ్రెస్‌ని సితార కోసంప్ర‌త్యేకంగా సెలెక్ట్ చేసి ఆ డ్రెస్‌ని అలియా బ‌హుమ‌తిగా సితార‌కు అంద‌జేసింది.  . ఈ బ్రాండ్ ప్రత్యేకంగా రెండు నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే. ఈ బ్రాండ్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంది.

- Advertisement -

అలియా బహుమతిగా ఇచ్చిన దుస్తులను ధరించిన తరువాత సీతార‌‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోల‌ని షేర్ చేసింది. సితార‌కు అలియా అంటే పిచ్చి అభిమానం. అదే విష‌యాన్ని ఇన్ స్టాలో పేర్కొంది. `నా అభిమాన నటి నుండి ఈ అందమైన డ్రెస్‌ని పొంద‌డం ఆనందంగా వుంది. ఈ డ్రెస్‌ని బ‌హుమ‌తిగా ఇచ్చినందుకు అలియాభ‌ట్‌కు ధన్యవాదాలు అని సితార మురిసిపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All