
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తరువాత బాలీవుడ్‌లో స్టార్స్‌ని ఫాలో అయ్యే వాళ్లంతా అన్ ఫాలో చేయడం మొదలుపెట్టారు. నెపోటిజమ్ పై, బాలీవుడ్ మాఫియాపై భారీ స్థాయిలో సోష్ మీడియా వేదికా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మదలుపెట్టారు. ఈ క్రమంలో నెటిజన్స్‌కి అడ్డంగా బుక్కైన హీరోయిన్ అలియా భట్. మహేష్ భట్.
మరి వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందంటే.. దానికి సబంధించిన ట్రైలర్ వచ్చేస్తోందంటే నెటిజన్స్ రెచ్చిపోరూ సాక్ష్యాత్తు అదే జరిగింది. సంజయ్‌దత్, అలియా భట్,ఆదిత్యరాయ్ కపూర్‌ల కలయికలో మహేష్ భట్ రూపొందిస్తున్న చిత్రం `సడక్ 2`. సడక్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఇంకే ముందు నెటిజన్స్ డిస్లైక్ లతో హోరెత్తించేశారు.
ఈ ట్రైలర్‌కు లక్ష వరకు లైకులు వస్తే డిస్ లైకులు 15 లక్షలు దాటడం సంచలనంగా మారింది. దీని సంఖ్య మరింతగా నెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. సుశాంత్ అభిమానులతో పాటు ఓ రాజకీయ నేత `సడక్ 2` పై డిస్ లైకులని హోరెత్తించారని చెబుతున్నారు.