
బిగ్ బాస్ 4 రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ లో సేఫ్ గేమ్ ఆడి నాగార్జున చేత అక్షింతలు వేయించుకున్న సంగతి తెల్సిందే. బిగ్ బాస్ లో 9 మంది నామినేషన్స్ లో ఉండగా నిన్న కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయింది. అలాగే గంగవ్వ సేవ్ అయింది. ఈ నేపథ్యంలో ఇంకా 7గురు నామినేషన్స్ లో ఉన్నారు. అభిజీత్, నోయెల్, అమ్మ రాజశేఖర్, సోహైల్, అలేఖ్య హారిక, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి నామినేషన్స్ లో ఉన్నారు.
అయితే ఆమెది నిజమైన ఎలిమినేషన్ కాదు, ఫేక్ ఎలిమినేషన్. అలేఖ్య హారికను ఎలిమినేట్ చేసినట్లే చేసి ఆమెను సీక్రెట్ రూమ్ లోకి పంపుతారు. మళ్ళీ సమయం చూసి ఆమెను తిరిగి హౌస్ లోకి పంపుతారు. ఈ విధంగా లాస్ట్ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విషయంలో జరిగింది. మరోసారి బిగ్ బాస్ అదే స్ట్రాటజీను నమ్ముతున్నాడు. మరి ఈసారి ఇది ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో చూడాలి.