Homeటాప్ స్టోరీస్2020 నాకు వెరీ వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్ - అల్లు అర్జున్‌

2020 నాకు వెరీ వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్ – అల్లు అర్జున్‌

2020 నాకు వెరీ వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్ - అల్లు అర్జున్‌
2020 నాకు వెరీ వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్ – అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్ బ‌న్నీ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌‌త్వంలో గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గ‌త ఏడాది సంక్రాంతికి జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌లైంది. నేటితో ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా చిత్ర బృందం సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో `అల వైకుంఠ‌పుర‌ములో` రి మునియ‌న్ బాష్‌ని నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ` గ‌త‌ ఏడాది ప్ర‌పంచానికి చాలా బ్యాడ్ ఇయ‌ర్‌. కానీ బ‌న్నీగారు మీకు మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్ అని చాలా మంది అంటుంటారు. నిజంగా ఇది నిజం. నా లైఫ్ టైమ్‌లో వ‌న్ ఆఫ్ ద బెస్ట్ ఇయ‌ర్‌.. బెస్ట్‌ మెమ‌రి ఫిల్మ్ ఇది. నిజంగా ఈ సినిమా ఆ టైమ్‌లో రిలీజ్ కాకుండా వుంటే ఇంత వండ‌ర్‌ఫుల్ అనుభ‌వం మిస్స‌య్యే వాళ్లం. అంత‌కు ముందు ఏడాదిన్న‌ర పాటు ఇంట్లో ఖాలీగా కూర్చున్నా.. ఆ త‌రువాత కోవిడ్ కార‌ణంగా ఏడాది పాటు ఇంట్లోనే వున్నా నాలో చాలా ఎన‌ర్జీని నింపిన చిత్ర‌మిది. సినిమా రిలీజ్ త‌రువాత కూడా రికార్డులు కంటిన్యూ అవుతూ వ‌స్తున్నాయి. ఎక్క‌డా నాకు లో అనిపించ‌లేదు. ఎక్క‌డికి వెళ్లినా మీ సినిమా ఇన్నిసార్లు చూశాం అని చెబుతుంటే చాలా ఎన‌ర్జీ ఇచ్చిన‌ట్టుగా అనిపించింది. ఆ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వ‌ర‌కు న‌న్నుహైలో వుంచుతూ వ‌చ్చారు. ఈ సినిమా లేక‌పోతే నాలో ఆ స్పిరిట్ వుండేది కాదు. ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోల‌కు ఇండ‌స్ట్రీ హిట్ వుంది. మ‌న‌కెప్పుడు వ‌స్తుంద‌ని ఎదురుచూస్తుండేవాడిని. నాకు ఇండ‌స్ట్రీ హిట్ రావ‌డానికి ఇర‌వై ఏళ్లు ప‌ట్టింది` అన్నారు.

- Advertisement -

ఇది బిగినింగ్ మాత్ర‌మే అస‌లు ముందుంది ప్రామిస్ చేస్తున్నాను` అని బ‌న్నీ చెప్పారు. అంటే `పుష్ప‌`తో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దుల‌ప‌బోతున్నార‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌‌క‌త్వంలో అల్లు అర్జున్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్ప‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో వుంది. దీన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీతో పాటు ఇత‌ర భాషల్లోనూ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All