Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందిగా

అల వైకుంఠపురములో రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందిగా

అల వైకుంఠపురములో రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందిగా
అల వైకుంఠపురములో రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందిగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో అందరి అంచనాలను దాటుకుని బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర వసూళ్ల రేంజ్ బట్టి చూస్తే నాన్ బాహుబలి రికార్డ్ దాసోహమనడం ఖాయం. నిజానికి అల వైకుంఠపురములో చిత్రానికి హిట్ కళ సామజవరగమన సాంగ్ తోనే వచ్చేసింది. ఈ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అవ్వడంతో అందరూ అల వైకుంఠపురములో చిత్రం మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. ఒక్క పాట సూపర్ హిట్ అయితేనే సినిమాకు బ్లాక్ బస్టర్ కళ వచ్చేస్తుంది. అలాంటిది అల వైకుంఠపురములో చిత్రంలో రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎవరూ అందుకోలేనంత రేంజ్ కు చేరుకున్నాయి. ఆ హైప్ ను అలాగే కొనసాగించిన అల వైకుంఠపురములో టీమ్ సినిమా రిలీజ్ వరకూ హైప్ అలానే కొనసాగించగలిగింది.

ఇక సినిమా విడుదలయ్యాక డీసెంట్ ఎంటర్టైనర్ అని పేరు తెచ్చుకోవడంతో, రివ్యూలు పాజిటివ్ గా రావడం, సంక్రాంతి అడ్వాంటేజ్ కలిసి రావడంతో అల వైకుంఠపురములో రేంజ్ మారిపోయింది. పోటీగా మహేష్ బాబు చిత్రం ఉన్నా కానీ అల వైకుంఠపురములో ఎక్కడా తడబడలేదు. డీసెంట్ కలెక్షన్స్ తో మొదలైన అల వైకుంఠపురములో ప్రయాణం నెమ్మదిగా స్థాయి పెరుగుతూ పోయింది. ఓ దశలో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని డామినేట్ చేసే స్థాయికి చేరుకుంది.

- Advertisement -

ఇప్పుడు సెలవులు పూర్తైపోయాయి. ఎవరి పనుల్లో వారు పడ్డారు. దీంతో ఈ రెండు సినిమాలకు కలెక్షన్స్ తగ్గుముఖం పడతాయని ఆశించారు. సరిలేరు నీకెవ్వరు నెమ్మదించినా, అల వైకుంఠపురములో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సోమవారం, మంగళవారం కూడా ఈ చిత్రానికి వసూళ్లు బాగున్నాయి. వీక్ డేస్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ను చేరుకుంది. ఈ చిత్రం జోరు ఇలానే కొనసాగిస్తే తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దాటేయడం ఖాయం. చూస్తుంటే ఫుల్ రన్ లో నాన్ బాహుబలి రికార్డును కూడా అధిగమించేలా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All