Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో థీమ్ ఏంటో చెప్పేసిన త్రివిక్రమ్

అల వైకుంఠపురములో థీమ్ ఏంటో చెప్పేసిన త్రివిక్రమ్

అల వైకుంఠపురములో థీమ్ ఏంటో చెప్పేసిన త్రివిక్రమ్
అల వైకుంఠపురములో థీమ్ ఏంటో చెప్పేసిన త్రివిక్రమ్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన లేటెస్ట్ చిత్రం అల వైకుంఠపురములో. ఈ సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. టీజర్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అయితే టీజర్ లో కథ ఏంటనేది ఇంకా రివీల్ చేయలేదు. కేవలం ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక గొప్పింటి ఇంటికి వెళ్లి అక్కడ వారి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగించడం వంటి అంశాలైతే అర్ధమయ్యాయి కానీ కథ మాత్రం ఇదిమత్తంగా ఏంటనేది తెలియలేదు.

ఈ చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ ఈరోజు జరగనుంది. దాంట్లో థియేట్రికల్ ట్రైలర్ విడుదల కూడా జరుగుతుంది. సో, ట్రైలర్ చూస్తే కథ ఏంటనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశముంది. కథ మీద ఒక ఐడియా వస్తే అంచనాలు మరింత పెరగవచ్చు. అయితే ఇటీవలే ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో థీమ్ ఏంటనేది రివీల్ చేసేసాడు.

- Advertisement -

చాలా మందికి సంపదకి, ఐశ్వర్యానికి తేడా తెలియదని, ఈ సినిమాలో వీటి గురించి తేడాను సరదాగా చెప్పే ప్రయత్నం చేసానని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. పెద్దిల్లు విశాలంగా ఉండి చూడటానికి చాలా బాగుంటుంది కానీ అక్కడ ఎక్కువ సేపు ఉండలేము. అక్కడ సంపద ఉంటుంది కానీ ఐశ్వరం ఉండదు. అయితే ఒక మధ్య తరగతి ఇంటికి వెళ్తే ఇరుకుగా ఉన్నా కూడా అక్కడి ప్రతి విషయం మనల్ని ఆకర్షిస్తుంది. అక్కడే కిటికీకి అల్లుకున్న పందిరి మన మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అలాగే వంటింట్లోని బంగాళాదుంప వేపుడు మన ఆకలిని పెంచేస్తుంది. టీనో, కాఫీనో తాగేసి వెళ్లిపోదామనుకుంటే భోజనం పెట్టి కానీ పంపించరు. ఇలా ఉన్న ఇంట్లో సంపద లేకపోయినా ఐశ్వర్యం ఉంటుంది.

ఇలా సంపదకు, ఐశ్వర్యానికి మధ్య ఉన్న చిన్న తేడానే ఈ సినిమాలో చూపించడం జరిగింది. మాటల మాంత్రికుడు తనదైన స్టైల్లో ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలా ప్రెజంట్ చేసాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All