Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో బన్నీ.. సప్తగిరిని కాపీ అంటున్నారే!

అల వైకుంఠపురములో బన్నీ.. సప్తగిరిని కాపీ అంటున్నారే!

అల వైకుంఠపురములో బన్నీ.. సప్తగిరిని కాపీ అంటున్నారే!
అల వైకుంఠపురములో బన్నీ.. సప్తగిరిని కాపీ అంటున్నారే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో చిత్రానికి పబ్లిసిటీ ఓ రేంజ్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 7 నిమిషాల్లోనే 1 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి బన్నీ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. ఇక టీజర్ లో త్రివిక్రమ్ మార్క్, బన్నీ స్టైల్ రెండూ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. స్టోరీ తెలిసిందేలా అనిపించినా మాటల మాంత్రికుడు తనదైన శైలిలో ఈ టీజర్ ను కట్ చేయించాడు. బన్నీ మ్యానరిజమ్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా “స్టైల్ గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది”, అలాగే ఈ సినిమాలో విలన్ గా చేసిన సముద్రఖనిని వెక్కిరిస్తూ మూతిని పక్కకు తిప్పడం, “మీరు ఇప్పుడే కార్ దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పడం అన్నీ హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా టీజర్ లాస్ట్ లో కత్తి నుండి వచ్చే నిప్పుతో సిగరెట్ అంటించుకోవడం అనేది సూపర్బ్ గా వర్కౌట్ అయింది. ఈ లాస్ట్ షాట్ గురించే బన్నీ ఫ్యాన్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

ఆ సన్నివేశంలో బన్నీ ఆటిట్యూడ్ సూపర్బ్ అనే చెప్పాలి. ఇక ఇది కీలకమైన సమయంలో వస్తుందని అంటున్నారు. అయితే టీజర్ మొత్తానికే యూఎస్పి గా నిలిచిన ఈ షాట్ కాపీ అంటూ ఒక వర్గం సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టడం మొదలుపెట్టారు. గతంలో సప్తగిరి హీరోగా వచ్చిన వజ్రకవచధర గోవిందా అనే సినిమా గుర్తుందా. ఓవర్ బోర్డు వెళ్లిపోయే హీరోయిజం షాట్స్ తో విసుగెత్తించాడు సప్తగిరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. అయితే యూట్యూబ్ లోకెళ్ళి ఈ సినిమా ట్రైలర్ చూస్తే అందులో ఒక షాట్ మనల్ని ఆకర్షిస్తుంది. సప్తగిరి కత్తి నూరేవాడి దగ్గర నుండి కత్తి అందుకుని దానికి ఉన్న నిప్పుతో సిగరెట్ వెలిగించుకుని, తర్వాత ఆ కత్తి నూరే వాడి నోట్లో పెడతాడు.

- Advertisement -

ఇప్పుడు ఆల్మోస్ట్ అదే షాట్ ను అల వైకుంఠపురములో సినిమాలో వాడేసారని కొందరు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికర విషయం ఏమిటంటే వజ్రకవచధర గోవిందా సినిమాను తెరకెక్కించిన అరుణ్ పవార్, త్రివిక్రమ్ కు అసిస్టెంట్ గా చేసాడు. అంటే ఇప్పుడు అసిస్టెంట్ సినిమాలో షాట్ ను గురూజీ కాపీ కొట్టాడా లేక ఇది యాదృచ్చికమేనా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All