Homeగాసిప్స్త్రివిక్రమ్ మళ్ళీ కథ కాపీ కొట్టేశాడా?

త్రివిక్రమ్ మళ్ళీ కథ కాపీ కొట్టేశాడా?

త్రివిక్రమ్ మళ్ళీ కథ కాపీ కొట్టేశాడా?
త్రివిక్రమ్ మళ్ళీ కథ కాపీ కొట్టేశాడా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా కంటే రచయితగా దక్కే గౌరవం ఎక్కువ. ప్రతి సినిమాలో తనదైన శైలిలో ఫిలాసఫీని చెప్పి, జీవిత సత్యాలను ఈ తరం వారికి పరిచయం చేసి, పౌరాణికాల గురించి కొంచెమైనా ఆసక్తి కలిగేలా చేయడంలో త్రివిక్రమ్ శైలే వేరు. అయితే రచయితగా అందరూ అభిమానించి గౌరవంగా గురూజీ అని పిలిపించుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మాత్రం మొదటినుండి విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. తన రెండో సినిమా అతడు, కృష్ణ నటించిన ఒక పాత సినిమా నుండి స్ఫూర్తిగా తీసుకుని అల్లిన కథే అని అర్ధమవుతూనే ఉంటుంది. అత్తారింటికి దారేది కథలో కూడా స్ఫూర్తి తీసుకున్న పాయింట్స్ ఉన్నాయి. ఇక అ.. ఆ సినిమాను అయితే మీనా అనే నవలను అచ్చుగుద్దినట్లు దింపేసాడు. అజ్ఞాతవాసి సినిమాను లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కించాడు. ఈ విషయంపై ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు న్యాయ పోరాటానికి దిగితే గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక డీలింగ్స్ చేసుకున్నారు.

అరవింద సమేతను పక్కనపెడితే ఇప్పుడు తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో చిత్రానికి కూడా కాపీ మరకలు అంటుకుంటున్నాయి. చిన్నప్పుడే తల్లిదండ్రుల నుండి వేరుపడిన ఇద్దరు పిల్లలు ఒకరి స్థానంలో ఒకరు పెరుగుతుంటారు. ఈ నేపథ్యంలో తన ఇంటికే పనివాడిగా వచ్చిన హీరో.. ఆ ఇంట్లోనే కష్టాలను ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్లాడనేది ఈ సినిమా పాయింట్ గా తెలుస్తోంది. 1958లో ఎన్టీఆర్, సావిత్రి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఇంటిగుట్టు నుండి ఈ పాయింట్ చోరీ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. హీరో, హీరోయిన్ల మధ్య ట్రాక్ కూడా ఒక మలయాళ సినిమా నుండి కాపీ కొట్టి తీసినదే అన్న విషయం కూడా వార్తల్లో నిలిచింది. ఇలా కథలు చోరీ చేసే బదులు ధైర్యంగా వాటికి క్రెడిట్ ఇచ్చే తీసుకోవచ్చు కదా అని త్రివిక్రమ్ మీద విమర్శలు ఎప్పటినుండో వస్తున్నాయి. అయితే మనోడు మాత్రం తనకు తెలిసిన రూట్ లోనే వెళ్ళిపోతున్నాడు.

- Advertisement -

ఇంతకీ ప్రచారంలో ఉన్న రూమర్స్ నిజమేనా? నిజంగా అదే అల వైకుంఠపురములో చిత్ర కథా? త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగా ఇంటి గుట్టు కథను ఈ తరానికి తగ్గట్లుగా మార్చి తీస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమా విడుదలైతే కానీ తెలిసే అవకాశాలు లేవు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి భారీ కాంపిటీషన్ ఉన్న దృష్ట్యా ఈ సినిమాకు భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All