
2020లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అల వైకుంఠపురములో. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ హ్యాట్రిక్ సక్సెస్ ను సాధించింది. ఇంత పెద్ద సక్సెస్ సాధించిన చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ చిత్రం నిన్న నిర్వహించిన సైమా వేడుకల్లో ఏకంగా 10 అవార్డులను కొల్లగొట్టింది.
ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీతం దర్శకుడు, ఉత్తమ రచయిత, ఉత్తమ గాయకుడు వంటి కేటగిరీలలో సైమా అవార్డులను కొల్లగొట్టింది అల వైకుంఠపురములో. ఈ చిత్ర యూనిట్ మొత్తం ఈవెంట్ కు హాజరై అవార్డులను అందుకుంది. ఈ సందర్భంగా టీమ్ మొత్తం ఆనందంగా కనిపించింది.
అవార్డుల లిస్ట్:
ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో (హారిక అండ్ హాసిని క్రియేషన్స్)
ఉత్తమ హీరో: అల్లు అర్జున్
ఉత్తమ హీరోయిన్: పూజ హెగ్డే
ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎస్ ఎస్ థమన్
ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు: అర్మాన్ మాలిక్
ఉత్తమ సహాయ నటుడు: మురళి శర్మ
ఉత్తమ విలన్: సముద్రఖని
ఉత్తమ సహాయ నటి: టబు
What a Night ! Best Actor , Director , Actress , Music , Singer , Supporting role Male… Female , Lyrics, n more …. #AVPLSweep ! N Congratulations Thank you @siimawards for memorable night . pic.twitter.com/KtRpqtKgoa
— Allu Arjun (@alluarjun) September 19, 2021