Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

అల వైకుంఠపురములో 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

అల వైకుంఠపురములో 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
అల వైకుంఠపురములో 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. మొదటి రోజు నుండే ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ రాగా, అది కలెక్షన్స్ కు చాలా పెద్ద ప్లస్ అయింది. పోటీగా మహేష్ బాబు సినిమా ఉన్నా సరే అల వైకుంఠపురములో కలెక్షన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మొదటి రోజే ఈ చిత్రానికి 26.5 కోట్ల షేర్ రాగా, రెండో రోజు సోమవారం అయినా కూడా 10 కోట్ల షేర్ సాధించి నిలకడగా కొనసాగింది. ఇక నిన్న భోగి కావడంతో కలెక్షన్స్ మళ్ళీ పుంజుకున్నాయి. భోగి రోజున ఈ చిత్రం 11.1 కోట్ల షేర్ ను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.

అల వైకుంఠపురములో డొమెస్టిక్ సర్క్యూట్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్స్ ను సాధించి దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది. నిన్నటి నుండే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 88 కోట్లకు బిజినెస్ కాబడింది కాగా తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రం 46.7 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఈరోజు, రేపు కూడా పండగ సెలవులు ఉండడంతో ఈరోజు వచ్చిన స్థాయిలోనే కలెక్షన్స్ కంటిన్యూ అయ్యే అవకాశముంది.

- Advertisement -

అల వైకుంఠపురములో 3 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:

నైజాం : 13.6 కోట్లు

సీడెడ్ : 7.4 కోట్లు

గుంటూరు : 5.11 కోట్లు

ఉత్తరాంధ్ర : 6.19 కోట్లు

తూర్పు గోదావరి : 4.52 కోట్లు

పశ్చిమ గోదావరి : 3.48 కోట్లు

కృష్ణా : 4.52 కోట్లు

నెల్లూరు : 1.96 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 46.78 కోట్లు

చూస్తుంటే పండగ సెలవులు పూర్తయ్యే లోగానే అల వైకుంఠపురములో బ్రేక్ ఈవెన్ కు చేరుకునేలా కనిపిస్తోంది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నా కానీ బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All