Homeటాప్ స్టోరీస్అక్క‌డ కూడా బ‌న్నీ ర‌చ్చ మామూలుగా లేదుగా!

అక్క‌డ కూడా బ‌న్నీ ర‌చ్చ మామూలుగా లేదుగా!

అక్క‌డ కూడా బ‌న్నీ ర‌చ్చ మామూలుగా లేదుగా!
అక్క‌డ కూడా బ‌న్నీ ర‌చ్చ మామూలుగా లేదుగా!

స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న బ‌న్నీ పాన్ ఇండియా స్థాయిలో ఇప్ప‌టి వ‌రకే ఒక్క మూవీ కూడా చేయ‌లేదు. కానీ బ‌న్నీకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్ప‌డింది. బ‌న్నీ న‌టించిన `ఆర్య‌`, ఆర్య‌2` చిత్రాల్లోని ఆ అంటే అమ‌లాపురం.. ఆర్య 2 లోని `రింగ రింగ‌..` బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేశాయి. ఈ టు సాంగ్స్  పాన్ ఇండియా స్థాయిలో బ‌న్నీకి పాపులారిటీని తెచ్చిపెట్టాయి.

ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లై ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న `అల వైకుంఠ‌పుర‌ములో`తో బ‌న్నీ పాపులారిటీ మ‌రో స్థాయికి చేరింది. ఈ మూవీ సాంగ్స్‌ ఓ రేంజ్‌లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ మ‌రో రికార్డుని సొంతం చేసుకుంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్ర ట్రైల‌ర్ ఐఎండీబీలో టాప్ 20 ట్రైల‌ర్‌ల జాబితాలో నిల‌వ‌డం విశేషం.

- Advertisement -

వ‌ర‌ల్డ్ వైడ్ చిత్రాల్లో అత్యధిక శాతం వీక్షించిన ట్రైల‌ర్ ల జాబితాలో 20 చిత్రాలు నిలిచాయి. అందులో టాలీవుడ్ నుంచి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషంగా చెబుతున్నారు. భార‌త్ త‌రుపు నుంచి బాలీవుడ్ మూవీ `భాఘీ 3` .. టాలీవుడ్ నుంచి బ‌న్నీ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాలు మాత్ర‌మే ఐఎండీబీలోని టాప్ 20 జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All