
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ యూట్యూబర్‌కి షాకిచ్చారు. ఏకంగా యూట్యూబర్ రషీద్ సిద్ధిఖీపై 500 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. దీంతో ఈ ఇష్యూ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ కేసుకి అక్షయ్‌కి సంబంధం వుందంటూ యూట్యూబర్ రషీద్ సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
సుశాంత్‌కు `ఎంఎస్ ధోని` లాంటి చిత్రాలు దక్కడం అక్షయ్ జీర్ణించుకోలేకపోయాడట. ఆ కారణంగానే సుశాంత్ కేసుని ప్రభావిం చేయాలని ప్రయత్నించాడని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ముంబై పోలీసుల్ని సంప్రదించి ఈ కేసు పక్కదోవ పట్టేలా ప్రయత్నాలు చేశాడని అక్షయ్‌పై యూట్యూబర్ రషీద్ సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశాడు.
దీంతో ఆగ్రహించిన అక్షయ్‌కుమార్ యూట్యూబర్ పై 500 కోట్ల పరువు నష్టం దావా వేయడం సంచలనం సృష్టిస్తోంది. అక్షయ్‌పై ఆరోపణలు చేసిన యూట్యూబర్‌లో ఓ బ్లాక్‌మెయిలర్ అని తెలుస్తోంది. గత కొన్ని నెలల క్రితం మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు అతని తనయుడు ఆదిత్య ఠాక్రేపై కూడా సంచలన ఆరోపణలు చేశాడని, ఆ తరువాత అరెస్ట్ అయ్యాడని తెలిసింది. తన యూట్యూబ్ చానల్‌ని పాపులర్ చేసుకోవడం కోసమే సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నాడని ఇలాంటి ఆరోపణల కారణంగా అతను యూట్యూబ్ వీడియోల ద్వారా దాదాపు 15 లక్షల ఆదాయం పొందాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.