Sunday, December 4, 2022
Homeటాప్ స్టోరీస్అక్ష‌ర‌ మూవీ రివ్యూ

అక్ష‌ర‌ మూవీ రివ్యూ

అక్ష‌ర‌ మూవీ రివ్యూ
అక్ష‌ర‌ మూవీ రివ్యూ

న‌టీన‌టులు:   నందితా శ్వేత‌, శ్రీ‌తేజ‌‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, మ‌ధు నంద‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, అజ‌య్ ఘోష్‌, అప్పాజీ అంబ‌రీష‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, శ‌త్రు, స‌త్య త‌దిత‌రులు న‌టించారు.
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ‌బి. చిన్నికృష్ణ‌‌
నిర్మాత‌లు:  సురేష్‌వ‌ర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ‌
కెమెరా:  న‌గేష్ బ‌న్నేల్‌‌
సంగీతం:  సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ :  జి. స‌త్య‌‌
రిలీజ్ డేట్ :  26- 02- 2021
రేటింగ్ : 2.5/5

- Advertisement -

`ఎక్క‌డికి పొతావు చిన్న‌వాడా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది క‌న్న‌డ న‌టి నందితా శ్వేత‌. ఈ సినిమాతో న‌టిగా మంచి మార్కులు సొంతం చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల్లో గుర్తింపుని ద‌క్కించుకున్న ఈ క‌న్న‌డ సోయ‌గం తాజాగా మ‌హిళా ప్ర‌ధాన చిత్రం `అక్ష‌ర‌`తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందు కొచ్చింది. ట్రైల‌ర్, టీజ‌ర్‌ల‌తో ఆక‌ట్టుకున్న ఈ మూవీ ఆశించిన స్థాయిలోనే వుందా? .. డేర్ చేసి మ‌హిళా ప్ర‌ధాన చిత్రంతో స‌క్సెస్‌ని ద‌క్కించుకోవాల‌ని నందితా శ్వేతా చేసిన ప్ర‌య‌త్నం ఏ మేర‌కు ఫ‌లించింది అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:  
అక్ష‌ర ( నందితా శ్వేత‌) ఎవ‌రూ లేని ఒంట‌రి యువ‌తి. వైజాగ్‌లోని ఓ కాల‌నీలో వుంటున్న అక్ష‌ర‌ని ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు న‌లుగురు కుర్రాళ్లు ప్రేమిస్తుంటారు. అక్ష‌ర వైజాగ్‌లో పేరు మోసిన విద్యా విధాన్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా చేరుతుంది. అక్క‌డ విద్యార్థుల్ని వారిలో నెల‌కొన్న భ‌యాల్ని పోగొడుతూ వారికి అండ‌గా నిలుస్తుంటుంది. ఇదే అంశం న‌చ్చి కాలేజీ డైరెక్ట‌ర్ శ్రీ‌తేజ (శ్రీ‌తేజ‌) అక్ష‌ర‌ని ప్రేమిస్తూ వుంటాడు. త‌ను ప్రేమిస్తున్న విష‌యం అక్ష‌ర‌కు చెప్పాల‌నుకున్న సంధ‌ర్భంలోనే శ్రీ‌తేజ హ‌త్య‌కు గుర‌వుతాడు. అయితే ఆ హ‌త్య‌తో పాటు ఏసీపీని తానే చంపాన‌ని అక్ష‌ర పోలీసుల ఎదుట లొంగిపోతుంది. ఇంత‌కీ ఆ హ‌త్య‌లు చేసింది ఎవ‌రు?.. త‌నే ఎందుకు చేశాన‌ని అక్ష‌ర చెబుతోంది? .. అస‌లు అక్ష‌ర ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
`ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రంలో ఆత్మ ఆవ‌హించిన అమ్మాయిగా న‌టించి ఆక‌ట్టుకున్న నందితా శ్వేత .. అక్ష‌ర పాత్ర‌లోనూ అదే త‌ర‌హా న‌ట‌న‌కు ప్ర‌ద‌ర్శించి అల‌రించే ప్ర‌య‌త్నం చేసింది. సీరియ‌స్ స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌ని అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించి ఆకట్టుకుంది. విద్యా సంస్థ‌ల అధిప‌తిగా సంజ‌య్ స్వ‌రూప్ కీల‌క పాత్ర‌లో క‌నిపించి అల‌రించారు. ఇది ఆయ‌న‌కు కొత్త పాత్ర‌. ఆయ‌న విల‌నిజం సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. మ‌ధునంద‌న్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య కొన్ని చోట్ల న‌వ్వించారు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, అప్పాజీ అంబ‌రీష‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, శ‌త్రు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్థం:
ప‌రిమిత బ‌డ్జెట్ అనే లిమిటేష‌న్స్ వున్నా చిత్రాన్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. విద్యా వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ సాంకేతికంగా ఫ‌ర‌వాలేదు అనిపించే స్థాయిలో వుంది. న‌గేష్ బ‌న్నేల్ ఛాయాగ్ర‌హ‌ణం, సురేష్ బొబ్బిలి సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. అయితే ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్ ఆక‌ట్టుకునేదే అయినా దాన్ని ప్ర‌భావ వంతంగా తెర‌పైకి తీసుకురాలేక పోవ‌డం సినిమాకు ప్ర‌ధాన మైన‌స్‌గా మారింది. మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా వుంటే బాగుండేది.

తీర్పు:
విద్యా వ్య‌వ‌స్థలోకి కార్పొరేట్ శ‌క్తుల ఎంట్రీ నేప‌థ్య‌లో రూపొందిన చిత్ర‌మిది. అయితే ఇందులోని మంచి చెడుల‌ను చూపిస్తూనే ఓ యువ‌తి ప్ర‌తీకార చిత్రంగా తెర‌కెక్కించారు. నందితా శ్వేత న‌ట‌న ఆక‌ట్టుకునే విధంగా వుంది. అయితే ద‌ర్శ‌కుడు ప‌వ‌ర్‌ఫుల్ పాయింట్‌ని మ‌రింత ప్ర‌భావ వంతంగా తెర‌కెక్కిస్తే ఫ‌లితం మ‌రోలా వుండేది. ఆశించిన స్థాయికి ద‌గ్గ‌ర‌గా లేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌ని పించే స్థాయిలో వుంది. మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే ఈ సినిమాకు మిరింత‌గా ప్ల‌స్ అయ్యేది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts