
రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. కె.కె. రాధామోహన్ నిర్మించారు. రోమ్ కామ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని `ఆహా` ఓటీటీలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అవుతోంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
లాక్‌డౌన్ కి ముందే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు ఆరు నెలల విరామం అనంతరం `ఆహా` ఓటీటీలో విడుదల కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం రాజ్ తరుణ్‌కు మంచి విజయాన్ని అందించేలా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెస్‌ని కలిగించింది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని హీరో నాగచైతన్య రిలీజ్ చేశారు. మూవ అంతా ఫుల్ ఆఫ్ ఫన్‌తో సాగుతుందన్న సంకేతాల్ని అందిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే ఈ మూవీ ఈ దఫా రాజ్ తరుణ్‌కు హిట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా రోజుల తరువాత వాణీవిశ్వనాథ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తోంది. ఐ ఆండ్రూ విజువల్స్, విజయ్‌కుమార్ కొండ టేకింగ్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయి.
