దర్శకులు మారుతి ని అక్కినేని అభిమానులు తిట్టేస్తూ పండగ చేసుకుంటున్నారు . అక్కినేని నాగచైతన్య తో ” శైలజా రెడ్డి అల్లుడు ” చిత్రం చేస్తున్నాడు మారుతి కాగా అతడ్ని అతడి అభిమానులు తిట్టడం ఏంటి అని అనుకుంటున్నారా ? శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఈనెల 31న విడుదల అవుతుండగా ఇంకా ప్రమోషన్ లు మొదలు పెట్టలేదని వాపోతున్నారు అక్కినేని అభిమానులు . ఒకవైపు విడుదల కార్యక్రమం దగ్గర పడుతోంది కానీ పెద్దగా ప్రమోషన్ లు ఏవి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
అక్కినేని ఫ్యాన్స్ గోల ఎక్కువ కావడంతో కేరళలో వరదలు వస్తున్నప్పటికీ , భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ రీ రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని గోపీసుందర్ తో కలిసి ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు దర్శకులు మారుతి . దాంతో మారుతి పై విమర్శలు ఆపేసారు అభిమానులు . రమ్యకృష్ణ అత్తగా నటించగా అల్లుడు గా నాగచైతన్య నటించాడు ఇక హీరోయిన్ గా అను ఇమ్మాన్యు యేల్ నటించింది . టీజర్ తో శైలజా రెడ్డి అల్లుడు పట్ల క్రేజ్ ఏర్పడింది అయితే దాని క్యాష్ చేసుకోవడంలో యూనిట్ విఫలమయ్యిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇక శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్ ని ఈరోజు విడుదల చేస్తున్నారు .
Englisg Title: Akkineni fans fires on director maruthi