
స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి – అఖిల్ అక్కినేనిల తొలి కలయికలో రూపొందుతున్న చిత్రం `ఏజెంట్`. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సురేందర్‌రెడ్డి సరెండర్ 2 సినిమా బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్, టైటిల్ ఓ రేంజ్‌లో వున్నాయి. దీంతో ఈ మూవీపై సర్వత్రా చర్చ మొదలైంది.
ఫస్ట్ లుక్‌లో అఖిల్ బారు జుట్టు.. గడ్డం.. సిగరేట్ కాలుస్తూ యాటిట్యూడ్‌ని ప్రదర్శిస్తున్న తీరు ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజింగ్ లుక్‌ని దర్శకుడు సురేందర్‌రెడ్డి రిలీజ్ చేశారు. తాజాగా అఖిల్ స్టన్నింగ్ లుక్‌ని రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో కండలు తిరిగిన దేహంతో అఖిల్ మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్‌లోకి అఖిల్ మారడానికి వెనక పెద్ద స్టోరీనే వుందిని ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
`అఖిల్ ఈ రూపంలోకి మారడానికి 7 నెలల క్రితమే అతని కృషి మొదలైంది. ప్రతీ రోజు అతను చూపించిన అభిరుచి, వృత్తి పట్ల అతనికున్న అంకిత భావాన్ని చూసి విస్మయానికి లోనయ్యాను. అఖిల్ మేకోవర్ మేం కోరుకున్న విధంగా మారింది. `ఏజెంట్`తో మీరు మునుపెన్నడూ చూడని కొత్త అఖిల్‌ని చూపిస్తానని మీకు మాటిస్తున్నాను` అని ట్వీట్ చేశారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కాబోతోంది.