Homeటాప్ స్టోరీస్పోర్టులు చుడుతోన్న అఖిల్ ఏజెంట్!!

పోర్టులు చుడుతోన్న అఖిల్ ఏజెంట్!!

పోర్టులు చుడుతోన్న అఖిల్ ఏజెంట్!!
పోర్టులు చుడుతోన్న అఖిల్ ఏజెంట్!!

అఖిల్ అక్కినేని నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఈ దసరాకు విడుదల కాబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఈరోజే వచ్చింది. ఇదిలా ఉంటే అఖిల్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు అఖిల్. ఇది ఒక స్పై థ్రిల్లర్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఏజెంట్ చిత్రం వైజాగ్ పోర్టులో వెలుగుచూసిన హనీట్రాప్ నేపథ్యంలో సాగుతుందన్న టాక్ ఉంది.

ఏజెంట్ మొదటి షెడ్యూల్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో జరిగింది. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ చేసాక వైజాగ్ పోర్టులో షూటింగ్ చేసారు. వైజాగ్ కోస్టల్ బెల్ట్ ఏరియా మొత్తంలో అనువైన లొకేషన్స్ లో ఈ చిత్ర షూటింగ్ సాగింది. అలాగే హైదరాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. త్వరలోనే ఏజెంట్ యూనిట్ బుడాపెస్ట్ వెళ్లనుంది. అక్కడ చిత్రానికి సంబంధించి కీలకమైన షెడ్యూల్ జరుగుతుంది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చి బ్యాలెన్స్ షూటింగ్ ను కానిస్తారు.

- Advertisement -

అఖిల్ ఈ చిత్రం కోసం పూర్తిగా ఇమేజ్ మేకోవర్ కు వెళ్ళాడు. సురేందర్ రెడ్డి స్టైల్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. దాదాపు 40 కోట్ల బడ్జెట్ ను ఈ చిత్రం కోసం కేటాయించినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All