Homeటాప్ స్టోరీస్మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ : రివ్యూ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ : రివ్యూ

Akhil Most Eligible Bachelor Review Rating
Akhil Most Eligible Bachelor Review Rating

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

- Advertisement -

ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ బాగుండాలని నమ్మే హర్ష (అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా తన లైఫ్ పార్ట్ నర్ కోసం ఇండియా వస్తాడు. మ్యారేజ్ లైఫ్ కోసం ముందే అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న హర్ష తన మీద తనకు ఉన్న కాన్ ఫిడెంట్ తో పెళ్లికి ముందే ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకుంటాడు. అంతేకాదు అనుకున్న డేట్ కల్లా ఓ మంచి అమ్మాయిని వెతికి పట్టుకునేందుకు ప్రయాత్నిస్తాడు. దాదాపు 20 మంది అమ్మాయిలను పెళ్లిచూపులు చూసిన హర్ష పెళ్లిచూపుల్లో భాగంగా స్టాండప్ కమెడియంగా చేస్తున్న విభ (పూజా హెగ్దే) దగ్గర ఆగుతాడు. పెళ్లి విషయంలో ఆమెకు కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి. కొన్ని కారణాల వల్ల విభతో సంబంధం కాదనుకుంటుంది హర్ష ఫ్యామిలీ. అయితే హర్ష మాత్రం ఆమెపై మనసు పారేసుకుంటాడు. విభా మాత్రం అతనికి నో చెబుతుంది. ఆ టైం లో విభ పెళ్లి గురించి హర్షని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలు ఏంటి..? ఈ టైం లో హర్ష తెలుసుకున్న జీవిత సత్యాలేంటి..? హర్ష విభ ప్రేమని గెలిచాడా లేదా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అంటే సినిమా కథలో పెద్దగా డెప్త్ లేకున్నా కథనంలో డెప్త్ ఉంటుంది. బొమ్మరిల్లు సినిమా తరహాలోనే బ్యాచ్ లర్ సినిమాను నడిపించాడు డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ఇక ప్రేమ కథలన్ని ఒకే చిన్న లైన్ తో ముడిపడతాయి. అదే కథను డైరక్టర్ సరికొత్త ట్రీట్ మెంట్ తో తీయాల్సి ఉంటుంది. ఒక చిన్న పాయింట్ చుట్టూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కథ నడుస్తుంది.

అయితే సినిమా కథ కొద్దిగా సినిమాటిక్ గా అనిపిస్తుంది. అయినా సరే ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ పెళ్లిచూపులు ఎపిసోడ్ ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ ఫిల్ ఎంటర్టైనర్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా నిరాశపరుస్తుంది.

కోర్ట్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా ఎంటర్టైన్ చేయడంలో సఫలం అయ్యిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించగా సెకండ్ హాఫ్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా ఓవరాల్ గా అఖిల్ బ్యాచ్ లర్ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించే సినిమా ఇదని చెప్పొచ్చు.

నటీనటుల ప్రతిభ :

అఖిల్ మునుపటి సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో హర్ష పాత్రలో బాగా చేశాడు. సినిమా సినిమాకు పరిణితి పొందుతున్నాడు. ఇక పూజా హెగ్దే కూడా ఈ సినిమాకు స్పెషల్ అప్పియరెన్స్ అని చెప్పొచ్చు. ముర‌ళీ శ‌ర్మ‌, ఆమ‌ని, జ‌య‌ప్ర‌కాష్ పాత్ర‌లు మెప్పించాయి. సుడిగాలి సుధీర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి పాత్రలు ఆకట్టుకున్నాయి. సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

గోపీ సుందర్ మ్యూజిక్ రెండు సాంగ్స్ అలరించాయి. బిజిఎం కూడా మెప్పించింది. ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తన మార్క్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ అయ్యాయి.

బాటం లైన్ :

అఖిల్ బ్యాచ్ లర్.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ..!

రేటింగ్ : 2.75/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All