అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ తో సినిమాపై ఆసక్తికలిగేలా చేసిన బొమ్మరిల్లు భాస్కర్ ట్రైలర్ తో సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు.
పెళ్లిపై ఎన్నో ఆశలు ఉన్న ఒక హీరోయిన్.. మరోపక్క లైఫ్ లో 50 శాతం కెరియర్.. 50 శాతం మారీడ్ లైఫ్.. మారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలని హీరో అంటాడు. ఈక్రమంలో చాలా పెళ్లి చూపులను చూసిన హీరో సడెన్ గా పెళ్లి చూపులు చేసిన హీరోయిన్ కేసు వేయడంతో కోర్ట్ లో ప్రత్యక్షమవుతాడు. ఇంతకీ అసలు హీరో పెళ్లి పై ఉన్న కన్ ఫ్యూజన్ ఏంటి..? ఈమధ్యలో హీరోయిన్ తో ఉన్న కనెక్షన్ ఏంటి..? ఇవన్ని తెలియాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చూడాల్సిందే.
ట్రైలర్ చూస్తే మళ్లీ భాస్కర్ ఓ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడని అనిపిస్తుంది. సినిమాకు గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచేలా ఉంది. అక్టోబర్ 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.
