Homeగాసిప్స్అఖిల్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!

అఖిల్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!

అఖిల్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!
అఖిల్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!

అఖిల్ అక్కినేని.. తొలి సినిమా నుంచి హిట్టు కోసం దండ యాత్ర చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. `బొమ్మ‌రిల్లు`భాస్క‌ర్ కొంత విరామం త‌రువాత చేస్తున్న సినిమా ఇది. జీఏ2 బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్న వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న‌మైన ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని చాలా కొత్త పంథాలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇదైనా అఖిల్‌కి హిట్ ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతో బ‌న్నీ వాసు తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు.

గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈ చిత్రంలో అఖిల్ కొంత బ‌రువు పెరిగి బొద్దుగా క‌నిపించ‌బోతున్నాడు. ఆ మ‌ధ్య విడుద‌ల చేసిన ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఆ ప్లాన్ మారిపోయింది. కీల‌క స‌న్నివేశాలు మిన‌హా చిత్రీక‌ర‌ణ కొంత భాగం పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేయాల‌ని ఎదురుచూస్తోంది.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ల‌ని లాక్‌డౌన్ స‌మ‌యంలో రిలీజ్ చేసిన చిత్ర బృందం ఇంత వ‌ర‌కు మ‌రో న్యూస్‌ని, కానీ లుక్‌ని కానీ రిలీజ్ చేయ‌లేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో చిత్ర బృందం వున్న‌ట్టు తెలిసింది. టీజ‌ర్‌ని వ‌చ్చే నెల రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All