Homeటాప్ స్టోరీస్అఖిల్ సినిమాకి ప్రొడ్యూస‌ర్ దొరికాడు!

అఖిల్ సినిమాకి ప్రొడ్యూస‌ర్ దొరికాడు!

అఖిల్ సినిమాకి ప్రొడ్యూస‌ర్ దొరికాడు!
అఖిల్ సినిమాకి ప్రొడ్యూస‌ర్ దొరికాడు!

స్టార్ కిడ్ అక్కినేని అఖిల్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబినేష‌న్ పెట్ట‌య్యింది. స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌ని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య హీరోగా ఎంట్రీ ఇచ్చినా అఖిల్ కు ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ ప‌డ‌లేదు. చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వైఫ‌ల్యాల‌ని చ‌వి చూశాయి.

ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రం చేస్తున్న అఖిల్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్‌కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మ‌రో భారీ చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ నున్నారు. అయితే 45 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌పైకి రానున్న ఈ స్పై థ్రిల్ల‌ర్‌ని నిర్మించే నిర్మాత దొర‌క‌డం లేదంటూ ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి.

- Advertisement -

అయితే ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ ల‌భించార‌ట‌. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్ 9వ తేదీ ఉద‌యం 9:09 నిమిషాల‌కు రాబోతోంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ అ చిత్రానికి సంగీతం అందిస్తార‌ట‌. స్టైలిష్ మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ వుండ‌బోతోంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All