
నందమూరి బాలకృష్ణ పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. తన ఫెవరెట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అఖండ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. కేవలం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం అయింది. త్వరలోనే ఈ రెండు సాంగ్స్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను.
ఇదిలా ఉంటే అఖండ రిలీజ్ డేట్ పై కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. దసరా సీజన్ కు అఖండను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ రావడం దాదాపు అసాధ్యం కావడంతో బోయపాటి శ్రీను అఖండను దసరాకు విడుదల చేయాలని ఆలోచిస్తున్నాడు.
ఇందుకోసం అక్టోబర్ 8న కానీ 13న కానీ అఖండను విడుదల చేయాలని అనుకుంటున్నాడు. అయితే అఖండ పెండింగ్ వర్క్స్ తో అది సాధ్యమేనా అన్నది చూడాలి.