
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల ధరలను దారుణంగా తగ్గించివేసిన సంగతి తెల్సిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ రేట్లకే టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ధరల కారణంగా పెద్ద సినిమాలు విడుదలకు జంకే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవి అసలు వర్కౌట్ అవ్వవు అని వారు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో త్వరలోనే తెలుగు సినీ పెద్దలు మీట్ అయ్యి తమ సమస్యలను విన్నవించుకుంటారని, మళ్ళీ పూర్వపు రేట్లకే టికెట్ ధరలను ఫిక్స్ చేయాలని కోరతారని తెలుస్తోంది. మరి అదే కనుక జరిగి మళ్ళీ పూర్వపు ధరలు వస్తే కచ్చితంగా పెద్ద సినిమాలు విడుదలకు క్యూ కట్టే అవకాశముంది.
ఆ కోవలో ముందుగా వచ్చే చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ అఖండ. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముందు దసరాకు ఈ సినిమా విడుదలవుతుంది అని అనుకున్నా ఏపీలో టికెట్ల ధరల సమస్య తొలగేవరకూ అఖండ రిలీజ్ వాయిదా పడుతుంది.