
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా అఖండ. డిసెంబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరదుకున్నాయి. సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైశ్వాల్ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమా గురించి చెబుతూ తాను ఏ భాషలోనూ ఇలాంటి పాత్ర చూడలేదు. బాలకృష్ణ గారు సెట్ లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందని అన్నది.
ఆయన టైం అంటే టైమే.. ఉదయం 3 గంటలకు లేస్తారు.. ఆరు గంటలకు షూటింగ్ స్పాట్ కి వస్తారు. రోజంతా షూటింగ్ చేసినా సరే అస్సలు అలసిపోరు. ఒకరు ఆయన ముందే మీరు అసలు మనిషేనా..? అని అడిగానని అన్నది ప్రగ్యా జైశ్వాల్. బాలయ్య ఎనర్జీ చూసి ప్రగ్యా షాక్ అయిందని తెలుస్తుంది.
ఇక అఖండ డైరక్టర్ బోయపాటి శ్రీనుపై కూడా అమ్మడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆయన కథను నమ్మి సినిమా తీస్తారు. ఇలాంటి పవర్ ఫుల్ పాత్రకు బాలకృష్ణ గారే కరెక్ట్ అని నమ్మారు. ఇక ఈ సినిమాలో తనది కూడా ఒక కీలక పాత్ర అని చెప్పుకొచ్చింది ప్రగ్యా జైశ్వాల్. కంచె సినిమాతో ఫేం లోకి వచ్చిన ప్రగ్యా యువ హీరోల సరసన నటిస్తూ కెరియర్ సాగిస్తుంది. సీనియర్ హీరో నాగార్జున సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు అఖండ సినిమాలో ఆయనకు జోడీ కట్టింది.