Homeటాప్ స్టోరీస్క్లైమాక్స్ షూటింగ్ లో బిజీబిజీగా అఖండ

క్లైమాక్స్ షూటింగ్ లో బిజీబిజీగా అఖండ

క్లైమాక్స్ షూటింగ్ లో బిజీబిజీగా అఖండ
క్లైమాక్స్ షూటింగ్ లో బిజీబిజీగా అఖండ

నందమూరి బాలకృష్ణ వరస ప్లాప్స్ నుండి బయటపడటానికి చేస్తోన్న సినిమా అఖండ. తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అఖండ షూటింగ్ లాంగ్ బ్రేక్ తర్వాత ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం అఖండ షూటింగ్ ఇప్పుడు తమిళనాడులో సాగుతోంది.

తమిళనాడులో ఒక పెద్ద ఆలయ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారట. అది చిత్ర క్లైమాక్స్ అని తెలుస్తోంది. స్టంట్ శివ ఈ యాక్షన్ పార్ట్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్ లో ఉంటాయని భావిస్తున్నారు.

- Advertisement -

నందమూరి ఫ్యాన్స్ కూడా అఖండపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం విడుదలైన టీజర్ అఖండపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రగ్య జైస్వాల్, పూర్ణ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All