Homeటాప్ స్టోరీస్కర్నూల్ లో అఖండ 100 డేస్ ఫంక్షన్..

కర్నూల్ లో అఖండ 100 డేస్ ఫంక్షన్..

akhanda-100-days-function
akhanda-100-days-function

ఒకప్పుడు చిత్రసీమలో 50 డేస్ ,100 డేస్ ఫంక్షన్ల మాట వినిపించేది. చిరంజీవి , బాలకృష్ణ, వెంకటేష్ చిత్రాలు ఎక్కువగా ఈ ఫంక్షన్లు జరుపుకునేవి..కానీ ఇప్పుడు విడుదలైన రెండో రోజే సక్సెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. అది కాక ఈరోజుల్లో వారం నడవడమే గొప్పగా మారాయి. ఈ తరుణంలో అఖండ 100 డేస్ ఫంక్షన్ అనేది ఇప్పుడు ఫిలిం సర్కిల్లో సంతోషం నింపుతుంది. బాలకృష్ణ – బోయపాటి కలయికలో వచ్చిన అఖండ మూవీ హ్యాట్రిక్ విజయం సాధించింది.

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. రెండు పాత్రల్లో బాలయ్య నటవిశ్వరూపం , థమన్ మ్యూజిక్ , బోయపాటి మాస్ యాక్షన్ ఇలా అన్ని కూడా సినిమాను భారీ విజయం సాధించేలా చేసాయి. ఈ తరుణంలో సినిమా 100 డేస్ ఫంక్షన్ ను కర్నూలులో ఈ నెల 12న భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టిన చిత్ర బృందం `అఖండ కృతజ్ఞతా సభ` పేరుతో ఈ ఫంక్షన్ ని నిర్వహించబోతున్నారట. ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులు మొత్తం పాల్గొనబోతున్నారని ఇందు కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All