Homeటాప్ స్టోరీస్సీఎం ఎవరైనా నాకు తలవంచాల్సిందే : అక్బరుద్దీన్

సీఎం ఎవరైనా నాకు తలవంచాల్సిందే : అక్బరుద్దీన్

Akbaruddin owaisi sensational comments on TS CMతెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరైనా సరే నాకు తలవంచాల్సిందే అంటూ సంచలన కామెంట్ చేసాడు వివాదాస్పద తాజా మాజీ ఎం ఎల్ ఏ అక్బరుద్దీన్ ఓవైసీ . ఎం ఐ ఎం పాతబస్తీ లో పాతుకుపోయిన విషయం తెలిసిందే . అయితే అక్బరుద్దీన్ అన్న అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుంటే , ప్రచారం చేస్తుంటే తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం కేసీఆర్ తో పాటుగా మిగతా నాయకులను ఎవరినీ లెక్కచేయడం లేదు . అంతేకాదు ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి , రోశయ్య, ఇక ఇప్పుడేమో కేసీఆర్ ఇలా సీఎం ఎవరైనా సరే నాకు తలవంచాల్సిందే అంటూ ప్రచారం చేస్తున్నాడు . అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి .

అంతేకాదు రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరు కావాలో తేల్చి చెప్పేది మేమె ! అవసరమైతే మేమె ముఖ్యమంత్రి అవుతాం ! ఏం కాలేమా ! ఆ దమ్ము మాకు లేదా ? అంటూ సవాల్ విసురుతున్నాడు . అయితే అక్బరుద్దీన్ పలువురు ముఖ్యమంత్రులు నాకు ఊడిగం చేసారు , చేస్తున్నారు అని అన్నాడు కానీ చంద్రబాబు పేరు మాత్రం ఎత్తలేదు . ఇంతకుముందు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు అక్బరుద్దీన్ ఓవైసీ అయితే అతడి చర్యల పట్ల ఫ్రభుత్వాధి నేతలు మాత్రం స్పందించలేదు ఇదేం రాజకీయమో ! మరి .

- Advertisement -

English Title: Akbaruddin owaisi sensational comments on TS CM

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All