Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ కోసం `ఆర్ఆర్ఆర్` స్టార్?

ప్ర‌భాస్ కోసం `ఆర్ఆర్ఆర్` స్టార్?

ప్ర‌భాస్ కోసం `ఆర్ఆర్ఆర్` స్టార్?
ప్ర‌భాస్ కోసం `ఆర్ఆర్ఆర్` స్టార్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భా‌స్ కోసం బాలీవుడ్ స్టార్‌ని దించేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో న‌టిస్తున్న ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ వ‌రుస‌గా ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌నున్న సైన్స్ ఫిక్ష‌న్‌తో పాటు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తో `ఆది పురుష్‌`లో న‌టించ‌నున్నారు.

టిసిరీస్ అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లైంది. రామాయ‌ణ గాధ నేప‌థ్యంలో 3డీ ఫార్మాట్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ఈమూవీ కోసం రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్నారు. మ‌రో కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌న్‌ని మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌.

- Advertisement -

ఇప్ప‌టికే `ఆర్ ఆర్ ఆర్‌`తో తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి సినిమా చేస్తున్న అజ‌య్ దేవ‌గ‌న్‌తో ఈ చిత్రంలో శివుడి పాత్ర‌ని చేయించాల‌నుకుంటున్నారని మీడియాలో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబ‌ర్ నుంచి ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభించాల‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఇప్ప‌టికే ప‌క్కా ప్లాన్‌ని సిద్ధం చేశాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All