
కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్‌పుత్ జోడీగా రూపొందిన చిత్రం `RX 100`.సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన రచ్చ మామూలుది కాదు. భారీ కలెక్షన్‌లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా అత్యధిక వసూళ్లని రాబట్టిన చిన్న చిత్రంగా ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. తొలి చిత్ర దర్శకుడిగా అజయ్ భూపతి ఈ సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దీని తరువాత ఆయన `మహాసముద్రం` పేరుతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో తొలుత రవితేజ నటిస్తారని వార్తలు వినిపించాయి. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ రవితేజ ఇంట్రెస్ట్‌గా లేరనే వార్తలు షికారు చేశాయి. నాగచైతన్య చేసే అవకాశం వుందని మరో వార్త హల్‌చల్ చేసింది.
తాజాగా శర్వానంద్ పేరు తెరపైకొచ్చింది. కథ నచ్చడంతో శర్వా నటించడానికి గ్రిన్‌సిగ్నల్ ఇచ్చేశారట. మల్టీస్టారర్ చిత్రం కావడంతో మరో హీరో కోసం అజయ్ భూపతి అన్వేషణ మొదలుపెట్టారని, ఫైనల్ కాగానే సినిమా పట్టాలెక్కుతుందని తాజా సమాచారం. ఇందులో శర్వానంద్‌కు జోడీగా సమంత నటించే అవకాశం వుందని తాజా టాక్. శర్వానంద్, సమంత `జాను` చిత్రంలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.