
తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్‌కు తెలుగులో వరుస బంపర్ ఆఫర్లు లభిస్తున్నాయి. విక్టరీ మధుసూదన్‌రావు దర్శకత్వంలో రామోజీరావు రూపొందించిన చిత్రం `మల్లె మొగ్గలు`. ఇందులో హీరోగా నటించిన అలనాటి హీరో రాజేష్ కూతురే ఈ ఐశ్వర్యా రాజేష్. `కౌసల్యకృష్ణమూర్తి` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాల్లో మెరిసింది.
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న `టక్ జగదీష్`తో పాటు సాయిధరమ్‌తేజ్, దేవా కట్టా కాంబినేషన్‌లో రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ లోనూ అవకాశం దక్కించుకుంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ఐశ్వర్యను వెతుక్కుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ డెకేడ్‌కే వండర్‌గా నిలవనున్న `ఆర్ ఆర్ ఆర్`లోనూ గిరిజన యువతిగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవే కాకుండా తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లోనూ బంపర్ ఆఫర్‌ని దక్కించుకుందని తాజా టాక్. ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. ముందు ఈ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకున్నారు. పవన్ కు భార్య పాత్ర కావడం, ఈ పాత్రకు ప్రాధాన్యత కొంత తగ్గడంతో ఈ మూవీలో నటించడానికి సాయి పల్లవి ఆసక్తిని చూపించలేదు. దీంతో ఆ పాత్రలో ఐశ్వర్యా రాజేష్‌ని ఫైనల్ చేయాలని టీమ్ భావిస్తోందట.