Homeటాప్ స్టోరీస్నెగెటివ్ రోల్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేసింది

నెగెటివ్ రోల్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేసింది

అందాల భామ ఐశ్వర్యరాయ్ మణిరత్నం సినిమాలో నెగెటివ్ రోల్ పోషిస్తున్నానని కన్ఫర్మ్ చేసింది ప్యారిస్ వేదికగా . కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందాలను ఆరబోసి షాక్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్ మణిరత్నం సినిమాపై స్పందించింది . మణిరత్నం సినిమాలో నటించడానికి నేను చాలా ఎగ్జైట్ గా ఉన్నాను , ఎందుకంటే అది నా కెరీర్ లోనే చాలా విభిన్నమైన పాత్ర . నందిని అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాను అంటూ అసలు విషయాన్నీ చెప్పేసింది .

- Advertisement -

మణిరత్నం భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు . విక్రమ్ , కార్తీ , కీర్తి సురేష్ తదితరులు నటించనున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ నెగెటివ్ రోల్ పోషించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . కాగా ఆ వార్తలు నిజమే అని ఒప్పుకుంది . అలాగే నందిని పాత్ర కోసం షూటింగ్ ఎప్పుడు మొదలౌతుందా అన్న ఆసక్తి ఉందని అంటోంది ఐశ్వర్యరాయ్ . ఈ భామని ఇంతగా ఇన్స్పైర్ చేసిందంటే ఆ పాత్ర ఐష్ కు మంచి పేరు తెచ్చేలాగే కనబడుతోంది మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All