
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తోంది. ఎక్డ చూసినా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడాలేకుండా ప్రతీ ఒక్కరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన వారు కరోనా బారిన పడ్డారు.
తాజాగా కేరళకు చెందిన నటి ఐశ్వర్య లక్ష్మికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తను కేరళలోన తన ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో వుంది. డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటోంది. ఐశ్వర్య లక్ష్మి మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. `యాక్షన్` చిత్రంలో హీరో విశాల్‌కు ప్రియురాలిగా నటించింది.
ప్రస్తుతం ఆమె తెలుగులో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న `గాడ్సే` చిత్రంలో నటిస్తోంది. ఇది ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం. ఈ చిత్రాన్ని సీ.కల్యాణ్ నిర్మిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` చిత్రంతో పాటు ధనుష్ హీరోగా నటిస్తున్న `జగమే తంత్రం` చిత్రంలోనూ నటిస్తోంది.