Homeన్యూస్దసరా నుండి సంక్రాంతి వరకూ ఆహా రచ్చ మాములుగా లేదుగా

దసరా నుండి సంక్రాంతి వరకూ ఆహా రచ్చ మాములుగా లేదుగా

దసరా నుండి సంక్రాంతి వరకూ ఆహా రచ్చ మాములుగా లేదుగా
దసరా నుండి సంక్రాంతి వరకూ ఆహా రచ్చ మాములుగా లేదుగా

తెలుగు వారి ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కంటెంట్ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోస్ నిర్వహించిన ఆహా మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ తో మన ముందుకు వస్తోంది. దసరా నుండి సంక్రాంతి వరకూ తెలుగు ప్రేక్షకులకు ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదంటూ ఆహా ప్రమోట్ చేస్తోంది. దసరా నుండి సంక్రాంతి వరకూ రాబోయే తమ ప్రోగ్రామ్స్ గురించి అప్డేట్ ను ఒక వీడియో రూపంలో అందించింది.

సెలబ్రేట్ విత్ ఆహా హ్యాష్ ట్యాగ్ తో రూపొందించిన ఈ ప్రోమోలో మొత్తం ఆహా నుండి 9 చిత్రాల ప్రీమియర్స్ ఉండబోతున్నట్లు ప్రకటించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, లవ్ స్టోరీ, లక్ష్య, మంచి రోజులు వచ్చాయి, డిజె టిల్లు, రొమాంటిక్, అనుభవించు రాజా, పుష్పక విమానం, గని చిత్రాలు దసరా నుండి సంక్రాంతి లోపు ప్రీమియర్ కానున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

వీటితో పాటు ఓటిటి ప్లాట్ ఫామ్ కు అత్యంత కీలకంగా మారిన ఒరిజినల్స్ విషయంలో కూడా ఆహా వెనుకడుగు వేయలేదు. మొత్తం 10 ఆహా ఒరిజినల్స్ ను ప్రకటించింది. సేనాపతి, భామా కలాపం, 3 రోజెస్, అన్యాస్ ట్యుటోరియల్, అడల్టింగ్, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, సేగు టాకీస్, ఇంటింటి రామాయణం, క్కుబూల్ హై, సర్కార్ లతో పాటు అన్నిటి కంటే క్రేజీ ప్రకటన ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ టాక్ షో కు అన్ స్టాపబుల్ అని ప్రకటించింది ఆహా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All