Homeటాప్ స్టోరీస్నెట్‌ఫ్లిక్స్ సాలీడ్ కౌంట‌ర్ ఆహాకేనా?

నెట్‌ఫ్లిక్స్ సాలీడ్ కౌంట‌ర్ ఆహాకేనా?

నెట్‌ఫ్లిక్స్ సాలీడ్ కౌంట‌ర్ ఆహాకేనా?
నెట్‌ఫ్లిక్స్ సాలీడ్ కౌంట‌ర్ ఆహాకేనా?

డిజిటల్ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఓటీటీ ప్రాంతీయ కంటెంట్‌పై ముఖ్యంగా తెలుగు కంటెంట్‌పై ఎక్కువ దృష్టి సారించింది.  ఇందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘పిట్టా కథలు’ పేరుతో తొలి తెలుగు వెబ్ డ్రామాని అందించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైన విష‌యం తెలిసిందే.

త్వరలో ఇది నెట్‌ఫ్లిక్స్‌లో  స్ట్రీమింగ్ కాబోతోంది. ‘పిట్ట కథలు’ లస్ట్ స్టోరీస్ అఫీషియ‌ల్ రీమేక్. `పిట్టా కథలు` టీజ‌ర్ రిలీజ్ ప్రకటన సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్స్ అంటూ ప్ర‌చారం చేసింది. ఇది సహజంగానే ఆహా టీమ్‌కి చిరాకుని తెప్పించింది. కొత్త‌గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ మావే ఒరిజిన‌ల్స్ అని ఊద‌ర‌గొట్ట‌డం ఎందుక‌ని కౌంట‌రేసింది.

- Advertisement -

మ‌రి ఆహా కౌంట‌ర్‌కు నెట్‌ఫ్లిక్స్ ఊరుకుంటుందా? ద‌ఆనికి గ‌ట్టి రిప్లై ఇచ్చేసింది. ఆహా వ్యంగ్యంతో నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్ స్ట్రాటజీపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఈ రోజు నెట్‌ఫ్లిక్స్ `నో ఫైటింగ్ .. బాద్యత ఉండనక్కర్లే` అని ఓ ఫొటోని షేర్ చేస్తూ కౌంట‌ర్ ఇచ్చింది. అంత‌టితో ఆగ‌క  `వీడు.. వీడి యేషాలు!` అని క్యాప్షన్ ఇచ్చి గ‌ట్టిగానే గిల్లేశారు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట‌ వైరల్ అవుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All