Homeన్యూస్యాక్షన్ సన్నివేశాల్లో బిజీబిజీగా అఖిల్

యాక్షన్ సన్నివేశాల్లో బిజీబిజీగా అఖిల్

యాక్షన్ సన్నివేశాల్లో బిజీబిజీగా అఖిల్
యాక్షన్ సన్నివేశాల్లో బిజీబిజీగా అఖిల్

అఖిల్ అక్కినేనికి మొత్తానికి ఒక విజయం దక్కింది. తన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తో సక్సెస్ ను అందుకున్నాడు అఖిల్. ఈ సినిమా నిర్మాతలతో పాటు అన్ని పార్టీలకు లాభాలను తీసుకొచ్చింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో అఖిల్ ఇప్పుడు తన ఐదవ చిత్ర షూటింగ్ తో యమా బిజీగా ఉన్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక స్లీక్ యాక్షన్ థ్రిల్లర్ ను చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ కు ఏజెంట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరోపియన్ దేశమైన హన్గేరి రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతోంది. ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని అక్కడి ఫారిన్ క్రూ సహాయంతో షూట్ చేస్తున్నారు. ఏజెంట్ లో ఒక స్పై ఏజెంట్ గా కనిపిస్తాడు అఖిల్.

- Advertisement -

ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ యాబ్స్ ను పెంచి ఇమేజ్ మేకోవర్ కు వెళ్ళాడు అఖిల్. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ముందుగా ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికైనా కానీ ఇప్పుడు థమన్ స్థానంలో హిప్ హాప్ తమిళ వచ్చినట్లు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏజెంట్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రివీల్ అయ్యే వీలుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All