Homeగాసిప్స్`హిట్‌` సీక్వెల్ చేతులు మారుతోందా?

`హిట్‌` సీక్వెల్ చేతులు మారుతోందా?

`హిట్‌` సీక్వెల్ చేతులు మారుతోందా?
`హిట్‌` సీక్వెల్ చేతులు మారుతోందా?

మాస్‌కా దాస్ విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన చిత్రం `హిట్‌`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ద్వారా కొత్త ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. హీరో నేచుర‌ల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. సైలెంట్‌గా విడుద‌లైన ఈ మూవీ మంచి విజ‌యాన్ని సాధించింది. గౌత‌మ్ మీమ‌న్ పోలీస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాల త‌ర‌హాలో వుంద‌ని ప్ర‌శంస‌లు కూడా వినిపించాయి.

ఇదే చిత్రాన్ని ఇత‌ర భాష‌ల్లో రీమేక్ చేస్తుండ‌గా ఈ మూవీకి సీక్వెల్ రానుందంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ మూవీ సీక్వెల్‌ని అడివి శేష్‌తో చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. విశ్వ‌క్‌సేన్ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వుండ‌టంతో ఆ స్థానంలో అడివిశేష్‌ని తీసుకోబోతున్నార‌ట‌. థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన అడివి శేష్ అయితే సీక్వెల్‌కు బాగుంటుంద‌ని మేక‌ర్స్ బ‌లంగా న‌మ్ముతున్నార‌ట.

- Advertisement -

ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింది. శైలేష్ కొల‌ను తెర‌కెక్కించ‌నేఉన్న ఈ మూవీ ని త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అడివిశేష్ మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ రియ‌ల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న `మేజ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి ఈ మూవీని మ‌హేష్‌బాబు నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All