Homeటాప్ స్టోరీస్అడివి శేష్ క్రైమ్ థ్రిల్ల‌ర్  `హిట్ 2`  మొద‌లైంది!

అడివి శేష్ క్రైమ్ థ్రిల్ల‌ర్  `హిట్ 2`  మొద‌లైంది!

Adivi Seshs HIT 2 movie shoot started
Adivi Seshs HIT 2 movie shoot started

విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్`. మిస్స‌యిన ఓ యువ‌తి ఆచూకీని తెలంగాణ‌కు చెందిన ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేధించాడు అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ని కూడా చేయ‌బోతున్నామంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అలా ప్ర‌క‌టించిన‌ట్టుగానే సీక్వెల్‌గా `హిట్‌2`ని అదే ద‌ర్శ‌కుడితో ప్రారంభించారు.

అడివి శేష్ హీరోగా వాల్ పోస్ట‌ర్ సినిమాస్ బ్యాన‌ర్‌పై హీరో నేచుర‌ల్ స్టార్ నాని, ప్ర‌శాంతి త్రిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని శ‌నివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ఉద‌యం ఈ చిత్ర ‌ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇదే రోజు ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం అడివి శేష్‌పై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి హీరో నాని క్లాప్ నివ్వ‌గా, నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్నేని కెమెరా స్విఛాన్ చేశారు.

- Advertisement -

`హిట్‌`ని తెలంగాణ పోలీస్ ఆఫీస‌ర్ నేప‌థ్యంలో రూపొందిస్తే `హిట్ 2`ని ఏపీ పోలీస్ ఆఫీస‌ర్ నేప‌థ్యంలో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం `మేజ‌ర్‌` షూటింగ్‌లో బిజీగా వున్న అడివి శేష్ ఆ మూవీ పూర్త‌యిన త‌రువాత ఈ చిత్రాన్ని ప్రారంభిస్తార‌ట‌. భానుచంద‌ర్‌, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీ‌కాంత్ మాగంటి, కోమ‌లి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మ‌ణికంద‌న్ ఛాయాగ్ర‌హ‌ణం, జాన్ స్టీవ‌ర్ట్ ఎడూరి సంగీతం, అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All