
విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక బేస్ ను ఏర్పరుచుకున్నాడు అడివి శేష్. ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలతో సూపర్ హిట్లు సాధించిన శేష్ ప్రస్తుతం యూఎస్ లో ఉన్నాడు. తన ఫామిలీతో సమయం గడపడానికి యూఎస్ వెళ్లిన శేష్ త్వరలోనే తిరిగి రానున్నాడు. వచ్చిన వెంటనే మేజర్ చిత్ర పెండింగ్ వర్క్ ను పూర్తి చేస్తాడు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హిట్ 2 షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేయనున్న ఈ సీక్వెల్ ను నాని నిర్మిస్తున్నాడు.
అలాగే శేష్ గూఢచారి 2 గురించి కూడా స్పందించాడు. ఈ ఏడాదే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి వచ్చే ఏడాది షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. శేష్.