
నటుడు అడివి శేష్ డెంగ్యూ ఫీవర్ బారిన పడిన విషయం తెల్సిందే. ఈ నెల 18వ తారీఖున అడివి శేష్ బ్లడ్ ప్లేట్ లెట్స్ సడెన్ గా డ్రాప్ అవ్వడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. సెప్టెంబర్ 20న ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసారు. అయితే అడివి శేష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, పూర్తిగా కోలుకున్నాక ఇంటికి పంపిస్తామని తెలిపారు వైద్యులు.
కొద్దిసేపటి క్రితం అడివి శేష్ ట్వీట్ చేసాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసానని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నానని తెలిపాడు. విభిన్నమైన చిత్రాలతో సక్సెస్ లు సాధిస్తూ అడివి శేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నాడు.
26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే నాని నిర్మాతగా సూపర్ హిట్ చిత్రం హిట్ కు సీక్వెల్ హిట్ 2 లో కూడా హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. అలాగే అడివి శేష్ కెరీర్ లో మెమొరబుల్ ఫిల్మ్ గూఢచారికు సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది.
View this post on Instagram