
తొలి చిత్రం `Rx100` చిత్రంలో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. ద్వితీయ ప్రయత్నంగా ఆయన చేస్తున్న చిత్రం `మహాసముద్రం`. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ మల్టీస్టారర్ గా సరికొత్త పంథాలో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని అజయ్ భూపతి డిజైన్ చేస్తున్నారు. ఈ మూవీలో శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర బృందం ఈ మూవీకి సంబంధించిన కీలక ప్రకటన చేసింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటికి వచ్చింది. విలక్షణమైన కథతో త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా అదితీరావు హైదరీని ఫైనల్ చేసినట్టు తెలిసింది. సినిమాలో అదితి పాత్ర కేవలం పాటలకు, కీలక సన్నివేశాలకు మాత్రమే పరిమితం కాకుండా చాలా వరకు గుర్తుండిపోయే పాత్ర అని, హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరుని తెచ్చిపెడుతుందని తెలుస్తోంది.
ప్రతీవారం ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ని అందిస్తామని వెల్లడించిన మేకర్స్ తాజాగా అదితీరావు హైదరీని ఈ మూవీ కోసం ఎంపిక చేసినట్టు సోమవారం ప్రకటించారు. ఈ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించిన తరువాత టాలెంటెడ్ హీరోయిన్ అతదితీరావె అయితే బాగుంటుందని భావించి ఫైనల్‌గా ఆమెని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. నటనకు ఆస్కారమున్న పాత్ర ఇదని, ఈ పాత్రకు ఆమె బెస్ట్ ఛాయిస్ అని, ఇదొక ఇంటెన్స్ వున్న యాక్షన్ డ్రామా అని మేకర్స్ స్పష్టం చేశారు.