Homeటాప్ స్టోరీస్సుధీర్ బాబు కి మార్కులేసిన అదితిరావ్ హైదరి

సుధీర్ బాబు కి మార్కులేసిన అదితిరావ్ హైదరి

aditi rao hydari praises sudheer babu actingసుధీర్ బాబు షాట్ గ్యాప్ లో సైలెంట్ గా ఉంటాడు కానీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఆ పాత్రలోకి ఇట్టే మారిపోతాడు అతడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది అని సుధీర్ బాబు యాక్టింగ్ కి మంచి మార్కులేస్తోంది బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైదరి . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు – అదితిరావ్ హైదరి జంటగా తెరకెక్కిన చిత్రం ” సమ్మోహనం ” . శ్రీదేవి మూవీస్ పతాకంపై తెరకెక్కిన సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఈ అందాల ముద్దుగుమ్మ .

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ భామ అయితే తెలుగులో నేరుగా నటించిన చిత్రం మాత్రం ఈ సమ్మోహనమే ! ఈనెల 15 న సమ్మోహనం విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ భామ పలు విషయాలను వెల్లడించింది . అయితే సుధీర్ బాబు గురించి అంతగా తెలియదు అలాగే అతడి సినిమాలు కూడా చూడలేదు కానీ హిందీలో భాగీ చిత్రంలో నటించాడని మాత్రమే విన్నాను , అయితే షూటింగ్ సమయంలో అతడి ప్రతిభ ఏంటో తెలిసింది అంటూ అతడి నటనకు ప్రశంసలు కురిపిస్తోంది అదితిరావ్ హైదరి . మనం మాత్రమే బాగా నటిస్తే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అంతే బాగా నటించాలి అప్పుడే ఆ సీన్ మరింతగా పండుతుంది అని అంటోంది . సినిమా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆదితిరావ్ హైదరి మాత్రమే కాదు సుధీర్ బాబు కూడా నమ్మకంగా ఉన్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All