
టాలెంటెడ్ బ్యూటీ అదితిరావు హైదరికి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో మంచి గుర్తింపు వున్న విషయం తెలిసిందే. హిందీ చిత్రాల్లో నటిస్తూనే తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆఫర్లని దక్కించుకుంటోంది. తెలుగులో `మహా సముద్రం`తో పాటు తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ బృందా రూపొందిస్తున్న `హే సినామిక` చిత్రాల్లో నటిస్తోంది.
ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో విలక్షణ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న `తుగ్లక్ దర్బార్`ని అంగకరించింది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి తాను తప్పుకున్నానని అదితిరావు హైదరి వెల్లడించింది. ఆమె స్థానంలో రాశిఖన్నాను చిత్ర బృందం ఫైనల్ చేసింది. గత ఏడు నెలలుగా వరల్డ్ సినీ లోకం స్థంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దశల వారీగా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. ఇప్పటికే మొదలైన ప్రాజెక్ట్‌లని పూర్తి చేయాలని దానికి కట్టుబడి వున్నాను. నా వల్ల ఏ ప్రాజెక్ట్ ఆలస్యం కాకూడదనే `తుగ్లక్ దర్బార్` నుంచి తప్పుకున్నానని అదితిరావు హైదరీ స్పష్టం చేసింది.
ఇటీవలే అదితిరావు హైదరి `మహా సముద్రం` చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది.