Homeటాప్ స్టోరీస్ఆడవాళ్లు మీకు జోహార్లు రన్ టైం ఎంతో తెలుసా..?

ఆడవాళ్లు మీకు జోహార్లు రన్ టైం ఎంతో తెలుసా..?

adallu meeku joharlu run time
adallu meeku joharlu run time

శర్వానంద్ – రష్మిక జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. రేపు (మార్చి 04 న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కుటుంబ సమేతంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేలా ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ (U) సర్టిఫికేట్ లభించింది. అలాగే ఈ మూవీ రన్ టైం కూడా చాల తక్కువగా సెట్ చేసారు.

కేవలం 141 నిమిషాలు నిడివి మాత్రమే వచ్చిందట. అంటే ఫస్ట్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు కలిపి సుమారు రెండు గంటల 21 నిమిషాలు అని చెప్పాలి. ఈ మధ్య ప్రేక్షకులు సైతం రన్ టైం తక్కువగా ఉంటేనే సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ కూడా రెండు గంటలన్నారా ఉంటే చూడలేకపోతున్నారు. అందుకే దర్శక , నిర్మాతలు రెండు గంటల పది నిముషాలు ఆలా ఉండేలా చూసుకుంటున్నారు.

- Advertisement -

ఇక ఈ మూవీ లో సీనియర్ నటీమణులు ఖుష్బు – రాధిక శరత్ కుమార్ – ఊర్వశి వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ – రవిశంకర్ – సత్య – ప్రదీప్ రావత్ – గోపరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. పాజిటివ్ బజ్ తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ..ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All