Homeటాప్ స్టోరీస్నితిన్ హీరోయిన్ ర‌చ్చ మామూలుగా లేదుగా!

నితిన్ హీరోయిన్ ర‌చ్చ మామూలుగా లేదుగా!

నితిన్ హీరోయిన్ ర‌చ్చ మామూలుగా లేదుగా!
నితిన్ హీరోయిన్ ర‌చ్చ మామూలుగా లేదుగా!

నితిన్ న‌టించిన `హార్ట్ ఎటాక్‌` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది అదాశ‌ర్మ‌. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర‌వాలేద‌నిపించింది. ఆ త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో క‌లిసి `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`లో మెరిసింది. పాత్ర చిత్ర‌దే అయినా గుర్తుంచుకునే పాత్ర కావ‌డంతో అంగీకిరించింది. అయితే ఆ సినిమా అదాకు ఏ విష‌యంలోనూ ఉప‌యోగ‌ప‌డ‌క‌పోగా న‌ష్టాన్నే క‌లిగింద‌చింది.

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, ఆది న‌టించిన `గ‌ర‌మ్‌`, క్ష‌ణం వంటి చిత్రంలోనూ న‌టించింది. ఇవేవీ అదాకు క్రేజ్‌ని, ఆఫ‌ర్ల‌ని అందించ‌లేక‌పోయాయి. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్క‌డ ఏ ఆఫ‌ర్ త‌గిలితే ఆ సినిమా చేస్తూ వేళుతోంది. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియాను హీటెక్కించేస్తోంది.

- Advertisement -

తాజాగా ఎఫ్ హెచ్ ఎమ్ ప‌త్రిక కోసం అదా చేసిన ఫొటో షూట్ కిర్రాక్ పుట్టిస్తోంది. సోష‌ల్ మీడియాలో కామ‌న్‌గా హ‌ద్దులు దాటి అందాల్ని ప్ర‌ద‌ర్శించే అదా ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫొటో అనే స‌రికి రెచ్చిపోయి అందాల్ని ప్ర‌ద‌ర్శించేసింది. అదా టూమ‌చ్ గ్లామ‌ర్ షోకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All